టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ సినిమాను తెరక్కెక్కించి మరోసారి సంచలనం అయ్యాడు. అయితే ఈ గాడ్, సెక్స్, నిజానికి మధ్య ఉన్న సంబంధమేంటి అన్నది ఇప్పటికీ చాలా వరకు తెలియట్లేదు గాని ‘గాడ్ సెక్స్&ట్రూత్’ సంబంధించిన కొన్ని చిత్రాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియా, టీవి చానెళ్ల డిబేట్స్.. ద్వార వర్మ కంటెంట్ ఎంతమందికి చేరాలో అంతమందికీ చేరుతుంది. సమాజం.. సంస్కారం లాంటి మాటలతో వర్మను అడ్డుకోవడం ఇప్పటిదాకా ఓ విఫలయత్నంగానే మిగిలిపోయింది. అయితే గాడ్ సెక్స్&ట్రూత్’ పోస్టర్ లీక్ అయిందా?.. లేక స్ట్రాటజీ ప్రకారం వర్మనే లీక్ చేశాడా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. వివాదాలతో పబ్లిసిటీని కోరుకునే వర్మ.. ఈ పోస్టర్ తో మరింత పబ్లిసిటీ వస్తుందని భావించే.. దీన్ని సోషల్ మీడియాలో వదిలారనేది కొంతమంది వాదన. అంతేకాదు లీకైన ఫోటోను చూస్తుంటే.. అది దొంగచాటుగా తీసినట్లు కనిపించడం లేదు. షూటింగ్ టైమ్ లో అఫీషియల్ గా తీసిన ఫోటోల లాగే కనిపిస్తోంది. కాబట్టి వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోను సోషల్ మీడియాలో లీక్ చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
