టీడీపీ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి.. తమ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా..? ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సక్యతతో ఉన్న చంద్రబాబు ఇప్పుటు రూటు మారుస్తున్నారా..? ఏపీలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కింది. రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన మైండ్ గేమ్‌కు పదునుపెట్టారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంపై ఏపీలో వ్యతిరేకత ఏర్పడటంతో ఇప్పుడు ఆ వ్యతిరేకతను మొత్తం బీజేపీపై నెట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాంగానే చంద్రబాబు తమ పార్టీ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు చేత రాజీనామా చేయించే ఉద్దేశంలో ఉన్నారట.
అయితే, నేను ముఖ్యమంత్రిని అయితే సింగపూర్‌లాంటి రాజధానిని కట్టి చూపిస్తానని చెప్పిన చంద్రబాబు… నాలుగేళ్లు గడిచినా ఇంకా డిజైన్ల ఎంపికలోనే ఉంటూ ప్రజలను కన్ఫూజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రజల సంక్షేమంలోనూ టీడీపీ ప్రభుత్వం వెనుకపడింది. అటు పింఛన్ల విషయం, మరో వైపు నిరుద్యోగ సమస్య, పోలవరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారం, విజయవాడ ఆలయంలో క్షుద్రపూజలు, మహిళలపై టీడీపీ ఎమ్మెల్యేల దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడానికి కారణాలు కోకొల్లలు.
ఇలా టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కాస్తా బీజేపీపై నెట్టి చంద్రబాబు కాస్త పాజిటివ్‌నెస్ క్రియేట్ చేసేందుకు తన రాజకీయ చాణిక్యతకు పదును పెడుతున్నారు చంద్రబాబు. మరి.. ఇలాంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలుచూస్తూ ఉంటారా..?