జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీలో చేస్తోందని చెప్పారు. తాను నిర్మాణాత్మకంగానే రాజకీయాలు చేస్తానని చెప్పారు. సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఉద్దేశమని అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన తనది కాదన్నారు. జనసేనకు ఎందుకు ఓటేయాలి అన్న అంశాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు.
ఇక ఓటుకు నోటు కేసు సమయంలో తాను మౌనంగా ఉండడానికి కారణం ఉందన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నదే అది అని.. అలాంటి సమయంలో తాను కూడా వచ్చి దాడి చేస్తే అస్థిరత ఏర్పడి ప్రజలకు న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే… ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించలేదని.. అలాంటి కొన్ని కారణాల వల్లే ఓటుకు నోటు అంశంలో చూసిచూడనట్టు వ్యవహరించానని పవన్ అన్నారు. ఓటుకు నోటు ఇవ్వడం తప్పు అన్నది తనకూ తెలుసని… అయితే ప్రభుత్వాలను నడపాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయని పవన్ చెప్పారు.