ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలననే తెలంగాణ ప్రాంతంలో భూగర్బజలాలు అడుగంటి పోవడానికి కారణమని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ పార్టీ ఫై విరుచుకపడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని నిడమనూరు యం.పి.పి సాగర్ నియోజకవర్గం పరిదిలోనీ నిడమనూర్ యం.పి.పి దాసరి నరసింహతో పాటు పెద్దవూర మండలం కొత్తలురు సర్పంచ్ ఒద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, సిరసన గండ్ల సర్పంచ్ పవన్ కుమార్ లతో పాటు నెల్లికల్ మాజీ సర్పంచ్ జఠావత్ పంతులు నాయక్, త్రిపురారం మండల టి.డి.పి అద్యక్షుడు కలకుండ వెంకటేష్వర్లు సోమవారం రోజున తెలంగాణ భవన్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టి.ఆర్ యస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ వారు చేయ్యని అభివృద్ధి ఇంకేయవృ చేయొద్దు అన్నట్లుగా ఈ రాష్ట్రంలో విపక్షాలు ప్రవర్తిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే అభినదించాల్సింది పోయి దొంగ కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే నన్నారు ఇంటిటికి మ్నాచినీరందించే మిషన్ భగీరధ కార్యక్రమానికి నిధులు రాకుండా మోకాలొద్దడింది కాంగ్రేస్ పార్టీ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు. చివరికి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రబద్దీకరణకు కూడా కాంగ్రెస్ నేతలు కేసులు వేసి అడ్డుకోవడంతో సుమారు 20 వేల మంది ఉద్యోగులు అభద్రతకు నెట్టబడ్డారని మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్థ పరిచారు. ఇన్ని చేస్తున్న ప్రజలు విజ్ఞత కోల్పోలేదని,తెలంగాణ ప్రజలు ఛైతన్యం కలిగినవారు కావడంతో టి.ఆర్.యస్ లో చేరేందుకు బారులు కడుతున్నారని ఆయన చెప్పారు.
సిగ్గు లజ్జ లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫై అవాకులు చవాకులు పేలుతున్న నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రోళ్లు అక్రమంగా నీళ్లు తీసుకపోవడంతో పాటు ఎడమకాలువ చివరి భూములను ఎండబెట్టినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు.డెడ్ స్టోరేజి లోను మంచినీటి పేరుతొ రైతాంగానికి సాగునీరందించి కాపాడిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.