తెలంగాణ రాష్ట్రంలో 70కి పైగా అసెంబ్లీస్థానాలను గెలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఇటీ వల ప్రధాని మోడీ చేసిన ప్రకటన ను చూస్తుంటే వచ్చే డిసెంబర్ లోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందన్నారు.వచ్చేనెల నుండి బస్సు యాత్ర చేపట్టి ..జనరల్ నియోజకవర్గాల పై దృష్టి పెడతామన్నారు.ఈ బస్సు యాత్ర ద్వారా మొత్తం 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తామన్నారు.వచ్చే జూన్ 2 న పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్య అతిధిగా రాహుల్ గాంధీ ని పిలిచి రాష్ట్రంలో జరుగుతున్న వైపల్యాలను ఎండగడతాం అని ఆయన అన్నారు