ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఇటు ప్రజల్లోనే కాకుండా ఏకంగా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు కనిపిస్తుంది.గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.తాజాగా అధికార టీడీపీ పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు .
రాష్ట్రంలో ఆదివారం అమరావతిలో జరుగుతున్న టీడీపీ పార్టీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సహనం ఎక్కువ .అందుకే గత నాలుగు ఏండ్లుగా దేశ రాజధాని ఢిల్లీకి నలబై నాలుగు సార్లు వెళ్లారు.దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సార్లు వెళ్ళలేదు అనుకుంట .
అయితే చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వెళ్ళుతున్నరో తెలుసుకోలేని అమాయకులు ప్రజలు కాదు ..ప్రజలకు కూడా సహనం ఎక్కువే .కానీ వాళ్ళు సహనం కోల్పోతే బాబు అండ్ బ్యాచ్ ను దింపి ఇంటికే పరిమితం చేస్తారు .ఇదే విషయం ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది .ఈ విషయాన్నీ బాబు గుర్తు పెట్టుకోవాలి .సీఎం కుర్చీని పూవులలో పెట్టి జగన్ కు అప్పగించే విధంగా బాబు వ్యవహరిస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .