వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు వైసీపీలో చేరుతున్నారు.అందులో భాగంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తోట్టంపాడు మండలానికి చెందిన కొణతనేరి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమణయ్య నాయుడు తన అనుచరవర్గంతో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా జగన్ వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .