చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ యాత్రను ప్రారంబించడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయుని ఆలయంకు బయలుదేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ జనసేన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్ళారు.ఈ సందర్బంగా కార్యాలయం వద్దకు వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు.
అయితే పవన్ కొండగట్టుకు బయలుదేరిన వేళ, ఆయన భార్య అన్నా లెజినోవా స్వయంగా హారతిచ్చి, వీడ్కోలు పలికిన వేళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. లైట్ మెరూన్ రంగు చీరలో మెరిసిపోతున్న అన్నా.. పవన్ కు ఎదురు వచ్చి తిలకం దిద్దుతున్న వేళ, ఆమెకు తిలకం ఎలా పెట్టాలో తెలియలేదు. ఆమె చూపుడు వేలితో కుంకుమను చేతికి తీసుకోబోగా వెంటనే పవన్ కలుగజేసుకొని..ఆ వేలితో కాదని, కుడి చేయి ఉంగరపు వేలితో ఇలా కుంకుమ దిద్దాలని చూపించారు.ఆపై అన్నా పవన్ కు అలానే కుంకుమతో వీర తిలకం దిద్దారు .తరువాత పవన్ తన భార్యను దగ్గరకు తీసుకుని వీడ్కోలు చెప్పి కారు ఎక్కగా, కారుకు ఎదురు వచ్చిన ఆమె, ఆపై వెనుదిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్లారు.