చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో పవన్ మొత్తం 150 కార్లతో భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి కొండగట్టు కు బయలుదేరి వెళ్లారు.మధ్యాహ్నం 3 గంటల సమయంలో పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు.ఈ నేపధ్యంలో తన భార్య లెజ్నోవా తనకు ఎదురొచ్చి.. తిలకం దిద్ది ..హారతిచ్చి కొండగట్టు కు పంపించారు.అయితే పవన్ మొదటగా తన అభిమానులకు అభివాదం చేశారు.కాబోయే సీఎం పవన్ అంటూ..పవన్ అభిమానులు నినాదాలు చేశారు.
ఇదిలావుండగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పై విమర్శలు మొదలయ్యాయి..తెలంగాణ ఇచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదు అన్న పవన్ తెలంగాణలో యాత్ర ఎలా చేస్తాడు..తెలంగాణ ను వ్యతిరేకించిన పవన్..ఇప్పుడెల తెలంగాణలో అడుగు పెడుతారు..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను దారి మళ్ళించేందుకే ఈ టూర్ అని కొందరు… నేరెళ్ళ ఘటన పై స్పందించని పవన్..ఇప్పుడు తెలంగాణలో పనేంటి అని …కత్తి మహేష్ తో వివాదం సమసిపోతే కొండగట్టుకు వస్తానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్ అని కొందరు ఇలా పలు రకాల విమర్శలు సంచలనం రేపుతున్నాయి .