స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జ్యురిచ్‌లో బస చేసిన హోటల్లో తాగునీటి నల్లా మీద ఉన్న సందేశాన్ని చూసి ఫిదా అయ్యారు.‘‘స్వచ్ఛం.. ఆరోగ్యకరం.. ఏ మాత్రం షుగర్ ఉండదు. కొవ్వు రహితం.. తాజా, సేంద్రియం.. తాగడానికి సురక్షితం.. జ్యురీ నీటిని ఆస్వాదించండి’’అనే సందేశం నల్లా మీద ఉంది దీన్ని చూసి కేటీఆర్ అబ్బురపడ్డారు.జ్యురిచ్ నగరం నల్లాల నీటిపై ఉన్న ప్రేమాభిమానాలను గర్వంగా, ఆత్మవిశ్వాసంతో చాటుకుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఈ ఏడాది పూర్తవుతుంది. మా ప్రభుత్వం సైతం ఇలాంటి సూచికలనే కోటి ఇళ్లలోని నల్లాల వద్ద పెడతుంది’’ అని తెలిపారు.
Was impressed with this note in my hotel at Zurich about the quality of their tap water ? love the pride & confidence
After Mission Bhagiratha (Telangana state drinking water project) is completed this year, Telangana can make a similar claim I suppose in all 1 crore homes ? pic.twitter.com/znFX4THkKk
— KTR (@KTRTRS) January 21, 2018