తెలంగాణలో టీడీపీ వెలుగిపోతుందట. అయితే, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీని ఎంతవీలైతే.. అంత త్వరగా టీఆర్ఎస్‌లో కలిపేస్తే మంచిదని చంద్రబాబుకు సలహాకూడా ఇచ్చారు మోత్కుపల్లి నర్సింహులు.
ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ..తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏపీకంటే మెరుగ్గా ఉందని, వెలగిపోతోందని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో నేతలంతా మూటాముళ్లు సర్దుకుని ఇతర పార్టీల వైపు చూస్తుంటే.. లోకేష్ మాత్రం తెలంగాణలో టీడీపీ వెలిగిపోతుందంటూ ఎలా చెప్తారని ఆ పార్టీ నేతలే నవ్వులు చిందిస్తున్నారు. అంతేగాక, కార్యకర్తలనే నేతలుగా తయారు చేస్తామని అనడం, ప్రస్తుతం టీడీపీ నేతలుగా ఉన్న వారిని కించపరచడమేనంటూ చర్చించుకుంటోంది ఆ పార్టీ కేడర్.