”పూనమ్, పవన్‌కు పరిచయమా? ఆ పరిచయం ఎంతవరకు? పవన్‌కల్యాణ్, పూనమ్ మధ్య ఏం జరిగింది?” అంటూ కత్తి చేసిన ఆరోపణలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. పూనమ్‌కౌర్‌పై సీని క్రిటిక్ కత్తి మహేష్ అడిగిన ప్రశ్నలు మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ”పూనమ్ ఆత్మహత్యకు యత్నించారు. ఆమె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి ఫీజులు ఎవరు కట్టారు” అనే ప్రశ్నలు కత్తి మహేష్ వేశారు. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం” అంటూ ఇలా మొత్తంగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ ఆరు ప్రశ్నలు వేశారు. అంతేకాదు బాబొయ్ తాను చేసిన ఆరోపణలు తప్పు అని భావిస్తే తక్షణమే పూనమ్ ప్రెస్‌మీట్ పెట్టి ఖండించాలని ఆయన అన్నారు. ఒకవేళ అవి అబద్ధాలని భావిస్తే.. తగిన ఆధారాలు చూపించాలని ఆమెను హెచ్చరించారు. ప్రస్తుతం ప్రశ్నలపై ఇటు సినీ ప్రముఖుల్లో..ఆటు సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
