వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలికి జిల్లా కోర్టు షాకిచ్చింది. కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ బాధితుడు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయానికి వాడుకుంటూ…రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… జిల్లా కలెక్టర్ అమ్రపాలి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tags colecter amrapali court icds room rent warangal