Home / ANDHRAPRADESH / ప‌వ‌న్ ఆవేద‌న..పార్టీపై కుట్ర జ‌రుగుతోంది

ప‌వ‌న్ ఆవేద‌న..పార్టీపై కుట్ర జ‌రుగుతోంది

త‌న పార్టీ గురించి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న పార్టీపై కుట్ర జ‌రుగుతోంద‌ని వాపోయారు. ఈ మేర‌కు ఏకంగా అభిమానుల‌కు లేఖ రాశారు. అంతేకాకుండా..వివాదాల్లోకి వెళ్ల‌వ‌ద్ద‌ని కోరారు. ఈ మేర‌కు ప‌వ‌న్ లేఖ‌ను విడుద‌ల ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు విడుద‌ల చేశారు. ఇదే ఆ లేఖ సారాంశం.

`జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా రాజకీయంలో ఒక భాగం. అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో ధృడ చిత్తంతో, అఖండ తెలుగు జాతి అండతో జనసేన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం విజ్ఞలయిన వారందరికీ విదితమే. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ శ్రేణుల్ని, జనసేన అభిమానులను గందరగోళం పరచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నదే. జనసేన ను తెలుగు ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారని మన ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అచంచల విశ్వాసముంది. ఆయన మాటలను ఆచరిద్దాం. ఆయన అడుగు జాడల్లో నడుద్దాం. జనసేన పార్టీ సిద్దాంతాలయిన కులాలను కలిపే ఆలోచన విధానం. మతాల ప్రస్తావన లేని రాజకీయం. భాషల్ని గౌరవించే సంప్రదాయం.సంస్కృతుల్ని కాపాడే సమాజం. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. సాధనకు కృషి చేయడమే మన కర్తవ్యం కావాలని. మనపై కువిమర్శలు చేసేవారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో మన ప్రియతమ నేత గత అక్టోబర్ ఏడో తేదీన విడుదల చేసిన ప్రకటనను మీకు మరోసారి అందిస్తున్నాము. జనసేన ను అభిమానించే వారంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటనలో చేసిన సూచనలను పాటిస్తారని ఆశిస్తున్నాము. కువిమర్శలు చేస్తున్నవారిని విస్మరించండి. పార్టీ ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లండి. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి -జైహింద్`

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat