తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్ర్రి కల్వకుంట్ల తారకరామారావు జపాన్ పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. పర్యటనలో భాగంగా జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. టోక్యో వేదికగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పాలసీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. అటు, జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతోనూ కేటీఆర్ చర్చించారు. అనంతరం… “తెలంగాణ స్టేట్, ఇండియా ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ సెమినార్” లో ఆయన పాల్గొన్నారు.
LOI signed between Government of Telangana and ISE Foods Inc. in the presence of Minister @KTRTRS and H.E. @SujanChinoy @IndianEmbTokyo in Tokyo today. ISE Foods Inc. will set up a pilot project for egg production using advanced technologies. pic.twitter.com/rQcfil73Ls
— Min IT, Telangana (@MinIT_Telangana) January 19, 2018
మరోవైపు, గుడ్ల ఉత్పత్తికి సంబంధించి తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు ఏర్పాటుపై జపాన్ కు చెందిన ఐఎస్ఈ ఫుడ్స్ సుముఖత వ్యక్తం చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ఐఎస్ఈ ఫుడ్స్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి.
Minister @KTRTRS addressing the delegates at "Telangana State, India Investment Promotion Seminar" at JETRO HQ in Tokyo today. pic.twitter.com/fkVLvSbjM1
— Min IT, Telangana (@MinIT_Telangana) January 19, 2018