వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళహస్తిలో సాగిన జగన్ పాదయత్ర రేణిగుంట మండలం పరకాల గ్రామంలో పర్యటించగా.. అక్కడ నాలుగేళ్ళ చిన్నారి గౌతమి తన కుటుంబ సభ్యులతో జగన్ను కలిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్ను కలిసిన గౌతమ తల్లిడండ్రులు తమ బాధను భరించారు. ఆరోగ్య శ్రీలో తమకు చికిత్స అందించక పోవడం వల్లనే తమ చిన్నారి చూపును కోల్పోవాల్సి వచ్చిందని గౌతమి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. దీంతో వారికీ దైర్యం చెప్పి గౌతమికి తగిన చికిత్స అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో ఆరోగ్య శ్రీ పథకం కింద ఇటువంటి సమస్యలకు వైద్యం చేసేవారని, చంద్రబాబు ప్రభుత్వ వచ్చాక పేదల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసి పట్టించుకోవడంలేదని.. ఆ చిన్నారి గౌతమికి చికిత్స చేయించే బాధ్యత తనదేనని జగన్ భరోసా ఇచ్చారు.