తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం సహా ప్రగతిభవన్‌పై విమర్శలు చేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ విస్పష్ట క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు. త్వరలోనే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఉంటుందన్నారు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే నగరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు.
ఇలాంటి రాష్ర్టానికి తగిన రీతిలో సచివాలంయ ఉండాలని పలువురు ఆకాంక్షించారని దానికి తగినట్లుగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. ప్రగతి భవన్ తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమని చెప్పారు. అందులో కేసీఆర్ ఒక్కరే ఉండరన్నారు.
తన తరువాత ఎందరో సీఎంలు వస్తారన్నారు.ఈ విషయం అర్థః కాని వారే విమర్శలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణకు పోలికే లేదని సీఎం కేసీఆర్. ఆ రాష్ట్రం కంటే తెలంగాణ ఎంతో ముందుందన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు.