దేశానికి రాజధానిగా తెలంగాణ..కొద్దికాలంగా జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారం…ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో సూపర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్తో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలనే ప్రతిపాదనలపై ఏమని అంటారని రాజ్‌దీప్ ప్రశ్నించగా…దేశానికి రాజధానిగా హైదరాబాద్ చేస్తారనడంలో తప్పు లేదన్నారు. దేశ ప్రజలు కోరుకుంటే హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడంలో ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం కాదని సీఎం కేసీఆర్ అన్నారు.
దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని సీఎం అన్నారు. `స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం.మన ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా మనం మారాలి` అని అన్నారు.