ప్రస్తుతం ఎక్కడ చూసి నిరుద్యోగ యువత నిద్రాహారాలు మాని సర్కారు కొలువును సంపాదించాలని ట్రైనింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పగలు అనక రాత్రి అనక అహర్నిశలు కష్టపడుతూ లైబ్రరీలలో చదువుతూ సర్కారు ఎప్పుడు నోటిపికేషన్లు ఇస్తుందా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు .ఈ క్రమంలో నిరుద్యోగులకు తీపి కబురును అందించింది కేంద్ర ప్రభుత్వం .
త్వరలోనే మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది .దీనిలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్ల్లో ఉన్న ఖాళీల భర్తితో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న మొత్తం ఇరవై లక్షల కొలువులను భర్తీ చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది .ఇందులో కేవలం ఒక్క రైల్వే శాఖాలోనే రెండు లక్షల పోస్టులను భర్తీ చేయనున్నది .
అంతే కాకుండా పోలీసు శాఖలో 5 లక్షలకు పైగా ఖాళీలను కూడా భర్తీ చేయనుంది. ఎలిమెంటరీ స్కూళ్లలో 5 లక్షలకు పైగా టీచర్ల నియామకం చేపట్టనుంది. రెండు లక్షల మందికి పైగా అంగన్‌వాడీ కార్మికులకు ఉపాధి కల్పించనుంది. రైల్వేల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులను భర్తీ చేయనుంది. ఆదాయ పన్ను శాఖలో 32,000 పోస్టులను ఇలా భారీ మొత్తంలో ఖాళీలను భర్తీ చేయనున్నది .