Home / SLIDER / బీసీల సంక్షేమం కోసం….టీ స‌ర్కారు కొత్త నిర్ణ‌యం

బీసీల సంక్షేమం కోసం….టీ స‌ర్కారు కొత్త నిర్ణ‌యం

తెలంగాణరాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధపెట్టిన సర్కారు.. సంక్షేమఫలాలను వారికి మరింత చేరువచేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం నెలకొల్పిన తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ తాజాగా పలు సూచనలతో ప్రభుత్వానికి 14 పేజీల నివేదికనుఅందజేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ పథకాలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని పేర్కొంటూ ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్ చైర్మన్‌గా ప్రభుత్వం అసెంబ్లీ కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీలో ఎమ్మెల్యేలు జీ విఠల్‌రెడ్డి, పుట్ట మధుకర్, చింత ప్రభాకర్, టీ ప్రకాశ్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, కొండాసురేఖ, దొంతి మాధవరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కొండామురళీధర్‌రావు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల సమావేశమైన కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 19 గురుకుల పాఠశాలలు ఉండగా, మూడేండ్లలో కేసీఆర్ సర్కారు 124 గురుకులాలను ప్రారంభించింది. వచ్చే విద్యాసంవత్సరం మరో 119 గురుకులాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గురుకులాల నిర్వహణ కోసం ఇప్పటికే నగరాలు, పట్టణాల సమీపంలో మూతపడి ఉన్న ఇంజినీరింగ్ కళాశాల భవనాలను తీసుకోవాలని కమిటీ సూచించింది. ఇప్పటికే కళాశాలల్లో ఉన్న సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా త్వరగా గురుకులాలను ఏర్పాటుచేయొచ్చని పేర్కొన్నది. పాత జిల్లాకేంద్రాల ప్రాతిపదికన రాష్ట్రంలో పది బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రతి జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ ఉండేలా మరో 21 కొత్త స్టడీ సర్కిళ్లను ఏర్పాటుచేయాలని నివేదించింది.బీసీ విద్యావంతులు కోచిం గ్ కోసం అధిక ఫీజులు చెల్లించలేక సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలురాయలేకపోతున్నారని, దీంతో తెలంగాణ బీసీల నుంచి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు సాధించినవారు అతికొద్ది మందే ఉన్నారని స్పష్టంచేసింది.

ఎక్కువమందిని సివిల్స్ వైపు మళ్లించేందుకు హైదరాబాద్‌లో బీసీ విద్యార్థుల కోసమే సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి, నిపుణులతో బోధించేలా చర్యలు తీసుకోవాలని నివేదించింది.మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఫిలిప్పీన్స్, చైనా వంటి దేశాల్లో ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్ వర్తింపజేయాలని కమిటీ సూచించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లల పెండ్లికి ఇప్పటివరకు రూ.60 కోట్లు ఇచ్చారు. ఈ పథకం కింద ఇచ్చే ఆర్థికసాయం కొంతమంది అధికారుల కారణంగా ఆలస్యంగా అందుతున్నది. కల్యాణలక్ష్మి చెక్కును పెండ్లి రోజే అందిస్తే అమ్మాయి తల్లిదండ్రులను ఆదుకున్నవాళ్లమవుతామని తెలిపింది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బెస్ట్ అవేలబుల్ స్కూళ్ల మాదిరిగానే బీసీ విద్యార్థుల కోసం కూడా ఏర్పాటుచేయాలని నివేదించింది. బీసీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధంలేకుండా 100 శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని సూచించింది. రుణాలన్నీ మార్చిలోపు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులకు నిర్దేశం చేయాలని కమిటీ తెలిపింది.ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల ఆర్థికప్రగతికి
తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది. కార్పొరేషన్‌కు ఇచ్చిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని సిఫారసు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat