దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చివరికి చంపేశారు. మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్ స్నేహితులు మద్య సేవించి బూతు చిత్రాలు చూసి ఎవరినైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలని భావించారు.అదే సమయానికి ఓ బాలిక అటువైపు గా వెళ్తుంటే..బలవంతంగా కిడ్నాప్ చేసి ముగ్గురు అత్యంత కృరంగా అత్యాచారం చేసి గాయపరిచారు. ఆ బాలికను సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని తాపీగా చెబుతున్నారు నింధితులు. బాలిక చనిపోయిన తర్వాత మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు.బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాతి రోజున నిందితులైన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకున్నారు.నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు.