తెలుగువారి ముచ్చటైన పండుగ సంక్రాంతి.పాడి పంటల సంబరం..పశువులను ఆరాధించే ఉత్సవం. పల్లె అల్లరికి ముద్దచ్చే రూపం.ఇవన్ని కలిస్తే సంకురాత్రి.దట్టమైన మంచు తెరల్లో ముద్దచ్చే పల్లె సోయగాలు రంగావల్లుల్లో దాగివున్న గొబ్బెమ్మల బుగ్గ చుక్కలు.చలి పొద్దుల్లో గంగిరెద్దుల మేలికోలుపులు .హరిదాసు కీర్తనలు.తొలి వేకువలో తలంటుల చలి చలికి భోగి మంటల నులువేచ్చ దనాల దుపట్లు. ఇంతకన్నా పెద్ద పండుగేముంది.సంక్రాంతి పండుగ తరుచుగా జనవరి 14 లేదా 15 వ తేది ల్లో వస్తుంది.ఇందుకు 10 రోజుల ముందు నుండే ఆటలు అడుతుంటారు .అందులో కొంచెం ముఖ్యమైన మీ కోసం..
కోళ్ళ పందాలు
ఎడ్ల పందాలు
ఉట్టి కొట్టడం
గాలి పటాలు ఎగరవేయడం
రంగవల్లులు
నాటకాలు ( హరికథలు)
గుండాట ( లచిం దేవి )
బావా మరదళ్ల చిలిపి ఆటలు
ముగ్గుల పోటీలు