తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు దక్షనయనంలో
ప్రజలు తాము పడిన కష్టాలను , భాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ..రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ..వేసే మంటలే భోగి మంటలు.
బోగి మంటలు వేయడంలో కొన్ని సైన్స్ కు సంబంధించి అంశాలు కుడా వున్నాయి.బోగి మంటలు వెచ్చదనం కోసమే కాదు…ఆరోగ్యం కోసం కుడా.ధనుర్మాసం నెలంతా ఇంటిముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు.వాటినే ఈ బోగి మంటలలో వాడుతారు.ఆవు పెడ పెడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది.సూక్ష్మ క్రిములు నశిస్తాయి.ప్రాణ వాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది.ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.చలి కాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి.ముక్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్థాయి.వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది.బోగి మంటలు పెద్దగ రావడానికి అందులో మామిడి , మేడి ,రవి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు.అవి కాలడానికి ఆవు నెయ్యీ వేస్తారు.అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల ఆవు నెయ్యీ నుంచి ఒక టన్ను ప్రాణ వాయువును విడుదల చేస్తుంది.ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యీ , ఆవు పెడకలు కలిపి కాల్చడం విడుదల అయ్యే గాలి అతి శక్తి వంతమైనది.మన శరీరంలో ని 72 వేల నాడుల లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు .. అదే అందరికి వస్తే..అందరికి ఔషధం సమకూర్చడం అసాధ్యం.అందులో కొందరు వైద్యం చేపించుకోలేని పేదలు కుడా ఉండవచ్చు.ఇదంతా ఆలోచించిన మన పెద్దలు.అందరూ కలిసి బిగి
మంటల్లో పాల్గొనే సంప్రదాయం తీ సుక వచ్చారు.దానినుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.కులాలకు అతీతంగా ఊరు వాడంతా ఒక్కచోట చేరడం ప్రజల మద్య వున్నా తేడాలను తగ్గిస్తుంది.ఐక్య మత్యాన్ని పెంచుతుంది.ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ..వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
బోగి మంటలకు ఎక్కువగా గ్రామీ ణులు తాటి ఆకులను ఉపయోగిస్తారు.ఈ ఆకులను బోగీ కి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి బోగి మంటలకోసం సిద్దం చేసుకుంటారు.వీటితో పాటుమంటలలో పనికిరాని పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్దం చేసుకుంటారు.తెల్లవారిజామున సాధారణంగా ౩ గంటలనుంచి 5 గంటల మద్యన ఈ మంటలను వెయ్యడం ప్రారంబిస్తారు.ఈ పండగ నాడు తెలుగు వారు కొత్త బట్టలను ధరించడం ఒక సంప్రదాయంగా వుంది.తెల్లవారి జామున బోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న, పెద్దలు బోగిమంటల సెగ తో కాచుకున్న వేడి నీటి తో లేదా మాములు నీ టి తో తల స్థానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు.పండుగ నెలలో ముగ్గులు ప్రతి రోజు వేస్త్గారు.కాని బోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత.రోజు వేసే ముగ్గు కన్నా బోగి రోజు మరింత అందంగా రంగు రంగుల రంగావల్లికలు వేస్తారు.