రేవంత్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది అప్పట్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ఓటుకు నోటు కేసు .తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఐదు కోట్ల ఆఫర్ లో భాగంగా యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే . ప్రస్తుతం ప్రధాన నిందితుడు కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ,ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దీనికి సంబంధించిన కేసులో బెయిల్ పై ఉన్నారు .
.అయితే తన పొలిటికల్ కెరీర్ ను చంద్రబాబు నాశనం చేశాడు అని రేవంత్ తెగ ఫీల్ అవుతున్నాడు అంట .ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తులేకపోవడంతో రేవంత్ ను ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు ఉత్సాహంగానే ఉన్నాయి.అయితే తాను టీడీపీ ను వదిలి వేరే పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటున్నాడు అంట .
అయితే తనకు అడ్డు ఉన్న ఓటుకు నోటు కేసులో మద్దతుగా నిలిచి రేవంత్ ను తమ పార్టీలోకి రప్పిస్తాను అని తనకు మామైన మాజీ సీనియర్ కేంద్ర మంత్రి జై పాల్ రెడ్డి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు ,కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ కు చెప్పాడు అంట .ఈ క్రమంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిను పార్టీలోకి చేర్చుకోవడానికి రాహుల్ ఓకే అన్నారు అంట .దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయం అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు .చూడాలి మరి రేవంత్ రెడ్డి తన మామ మాట నమ్మి కాంగ్రెస్ లోకి వెళ్లి బాబుకు దసరా గిఫ్ట్ ఇచ్చి పార్టీ మారతారా ..?లేదా రాజకీయ భవిష్యత్తు లేని టీడీపీలో ఉంటారా .?అనేది కాలమే నిర్ణయించాలి ..!