అరెరే.. చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!! ఇంతకీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆశలన్నీ గల్లంతవ్వడమేంటీ.. అతను సీఎం కదా..! ఏమైనా చేయగలడు అనుకుంటున్నారా..! అసలు విషయం అదికాదండీ.. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయట.
అసలు మేటరేంటంటే.. జగన్‌పై ఉన్న ప్రతి కేసులతో.. వచ్చే ఎన్నికల్లోగా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేతలకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. అంతేకాక.. 2జీ స్ప్రెక్ర్టం కేసు తీర్పు కూడా టీడీపీ నేతలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లోపు జైలుకెళ్లడం ఖాయమంటూ వీలుదొరికినప్పుడల్లా మీడియా సమావేశంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు కోర్టు తీర్పుతో ఒక్కసారిగా సైలెంటైపోయారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మార్ కేసులో సీబీఐ నిందితుడుగా పేర్కొన్న ఎల్‌వీ సుబ్రహ్మణ్యం కూడా ఇటీవల క్లీన్‌చిట్‌తో బయటపడ్డ విషయం తెలిసిందే. అంతేకాక..ఈ కేసులో సీబీఐపై హైకోర్టుఅక్షింతలు వేసింది. తగిన ఆధారాలు లేకుండా ఎలా కేసులు నమోదు చేస్తారంటూ.. కేసు నమోదు చేస్తే తగిన ఆధారాలు చూపాలని సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. ఇలా జగన్‌పై ఉన్న కేసుల్లో ఒక్కొక్కరుగా క్లీన్‌చిట్‌తో బయటపడటంతో.. జగన్‌కూడా క్లీన్‌చిట్‌తో బయటపడతాడని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.