పూనమ్ కౌర్ ప్రస్తుతం అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అండ్ హాట్ టాపిక్.ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ లపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.కత్తి మహేష్ చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి .
పూనమ్ కౌర్ కి ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పోస్టింగ్ ఇవ్వడం వెనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు .అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఓకే అంటే పూనమ్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టమే అని పూనమ్ గతంలో చెప్పింది అని మహేష్ అణుబాంబు పేల్చాడు.అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని లేపుతుంది.ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ కి చేనేత బ్రాండ్ అంబాసిడర్ పోస్టింగ్ దక్కడం వెనక పవన్ కళ్యాణ్ కాదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మంత్రి హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి.
గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ..అక్కడ నుండి టీడీపీలో చేరిన ఒక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉందని రాజకీయ వర్గాలు ,సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.అయితే సదరు మంత్రి ముఖ్యంగా మెగా కుటుంబానికి దగ్గరి వాడు .ఆ కుటుంబం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి హాజరవుతుంటాడు.ఈ సందర్భంలోనే సదరు మంత్రి పూనమ్ కౌర్ కి ఆ పోస్టింగ్ ఇవ్వడంలో చొరవ చూపించాడు అని ప్రస్తుతం వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే అర్ధమై ఉంటుంది కదా సదరు మంత్రి ఎవరో ..?