అవును. మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే అంటేనే.. సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాడట. అంతేకాదు. చంద్రబాబు డిసైడ్ చేసిన స్థానాల్లోనే పవర్‌స్టార్ అభ్యర్థులు పోటీ చేస్తారని సమాచారం. ఇంతకీ ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదండి బాబోయ్. స్వయాన పవన్ ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తి, సినీ క్రిటిక్ మహేష్ కత్తి అన్న మాటలే ఇవి.
ఇంతకీ పవన్ రాజకీయం గురించి కత్తి మహేష్ ఏమన్నాడనేగా మీ డౌట్. అదేం లేదండీ.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మనుషులను వాడుకుని వదిలేసే రకమని ఇప్పటికే రుజువైంది. ఈ మాటలనే పవన్ కూడా 2014 ఎన్నికల ప్రచారానికి ముందు అన్నాడని గుర్తు చేశాడు కత్తి మహేష్. 2019 ఎన్నికల తరువాత కూడా పవన్ పరిస్థితి కూరలో కరివేపాకే అన్నారు.
అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి.. ఎన్నికల్లో పోటీ చేస్తాం.. ముఖ్యమంత్రి పీటాన్ని కైవసం చేసుకుంటాం అని చెప్పాలే కానీ.. మేము పోటీ చేస్తామో లేదో మాకే తెలీదు… మాకు రాజకీయాలు అక్కర్లేదు.. ఎన్నిసీట్లలో పోటీ చేస్తామో తెలీదు.. ఇలా ప్రతీ దానికి తెలీదు.. తెలీదు.. అంటూ పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. వీటన్నిటిని చూస్తుంటే.. నాకో డౌట్ వస్తుంది.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమంటే… అక్కడ పవన్ కల్యాన్ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పాడు కత్తి మహేష్.