గుండెలపై గులాబీ జెండా కప్పుకున్నమంటేనే ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్‌వికెఎస్) కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ విద్యుత్ సంఘాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు టీఆర్‌వీకేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎంపి కవిత మాట్లాడారు. టీఆర్‌వీకేఎస్ అంటేనే బాధ్యత అన్నారు. విద్యుత్ ఉద్యోగులపై టీఆర్‌వీకెస్, టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రధ్ధ చూపుతుందని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డు పడుతున్నారని, ఈ విషయం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు కవిత చెప్పారు. ఉద్యమంలోనూ ముందున్న టిఆర్‌వికెఎస్ ఉద్యమం తరవాత కూడా అదే స్పూర్తితో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. గులాబి జెండా పేరుతో తెలంగాణ పేరును తనలో ఇముడ్చుకున్న టిఆర్‌వికెఎస్‌లో చేరిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేసే పనులను బలపరడం, తెలంగాణ ప్రజలను బలపర్చడమేనన్నారు. నిరంతర కరెంటు అందించడం వల్ల పారిశ్రామిక ప్రగతితో పాటు వ్యవసాయోత్పత్తుల పెంపుకు దోహదపడుతుందన్నారు. కార్మికులు ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుందన్నారు. యూనియన్ మిత్రులు సాధించాల్సిన సమస్యలను తనకు చెప్పారన్నారన్నారు కవిత. 2018 పిఆర్‌సిలో మెరుగైన వేతనాలు ఇప్పించాలని కోరారు.
పీఆర్‌సీని ఏర్పాటు చేశాక కృషి చేస్తామని ఎంపీ కవిత అన్నారు. 650 సీనియర్ ఎల్.ఎంలను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారని, సిఎండి, మంత్రితో మాట్లాడతానన్నారు. అలాగే 1991లో నియామకమయిన కార్మికులకు పే అనామలీస్ ను ఎగ్జామిన్ చేస్తామన్నారు. జెన్‌కో కార్మికులకు మెడికల్ క్రెడిట్ కార్డ్ ఆన్ లైన్ ఇప్పించాలని కోరారని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య విషయంలో మన రాష్ట్రం ముందుంన్నారు. నిజామాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని చెప్పారు. ఉద్యోగులకు వర్తించే వైద్యసౌకర్యం విద్యుత్ కార్మికులకు వర్తిస్తాయా లేదా అనే విషయంను అధికారులతో మాట్లాడి తెలుసుకుంటానన్నారు.