గంగిరెద్దుల ఆడించేవారు ఎలాంటి అపోహలు నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్‌లు స్పష్టంచేశారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హైదరాబాదు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు వీవీ శ్రీనివాస రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఇందులో పూర్తి స్పష్టత ఇచ్చారు.
`సంక్రాంతి పర్వదిన సందర్భంగా గంగిరెద్దుల ఆట ఆడించటం హిందూ సంస్కృతిలో ఒక వారసత్వ చిహ్నం. మరియు గంగిరెద్దుల ఆట మన తెలుగువారి సంప్రదాయం లో ఒక భాగం. ఈ విధముగా వారసత్వంగా వస్తున్న ఆటకు హైదరాబాదు సిటీ పోలీసు తరపున ఎటువంటి ఆటంకం ఉండదు. వారికి మా పూర్తి సహాయ సహాకారాలు ఉంటాయి. రహదారులపైన, చౌరస్తాల వద్ద బిక్షాటన చేస్తూ ప్రజలకు ఆటంకము కలిగిస్తున్న వారిని మాత్రమే అదుపులోనికి తీసుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాము. కానీ గంగిరెద్దులు ఆడించేవారికి ఎలాంటి అపోహలు వద్దు, వదంతులు నమ్మవద్దు మీకు మా సిటీ పోలీసు తరపున పూర్తి సహాయ సహకారము వుంటుంది, వారసత్వంగా వస్తున్న ఈ ఆటను మీరు పూర్తి స్వేచ్ఛగా కొనసాగించవచ్చును. మీకు నగరములో ఏదైన ఇబ్బంది కలిగినచో కంట్రోల్ రూమ్ నెం. 100, లేదా 27852333 కు తెలుపగలరు, మీ సమస్యను వెంటనే పరిష్కరించటానికి ప్రయత్నిస్తాము.`అని ఆయన స్పష్టం చేశారు.