ఏపీలో నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరి ఎక్కువగా విశాఖపట్టణంలో జరగడంతో స్థానిక ప్రజలు రక్షణ కరువైందని అంటున్నారు. తాజాగా నగరంలోని దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్‌రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దేవిరెడ్డి రాజేశ్‌రెడ్డి(35), భార్య సౌమ్య(30), పిల్లలు విష్ణు(7), జాహ్నవి(5)తో కలసి విశాఖ శివారులోని ఆరిలోవ ముస్తఫా కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న రాజేశ్ గురువారం ఉదయం పనికి వెళ్లి.. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు.
ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ రాత్రి 7 గంటల సమయంలో చెన్నైలో ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. చెన్నైలోని బంధువులు విశాఖ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే బంధువుల సమాచారం మేరకు విశాఖ పోలీసులు రాజేష్ రెడ్డి ఇంటికి చేరుకొనేసరికి వారు నలుగురు చనిపోయారు. చాలామంది కామాంధులు తన చుట్టూ తిరిగారని సౌమ్య సూసైడ్ లేఖ రాసింది. నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.కామాంధుల వేధింపులు భరించలేకపోతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కామాంధుల ఆగడాలను భరించే శక్తి వారి ఆగడాలను తట్టుకునే శక్తి ఇక లేదని, బ్లాక్ మెయిల్, బెదిరింపులు భరించలేకనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తరువాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా చంపాల్సి వచ్చిందని సూసైడ్ నోట్ లో రాసింది. కామాంధుల నుండి జాగ్రత్త తమ బంధువుల పిల్లలైన ప్రియ, పవిత్రలకు ఆ లేఖలో సౌమ్య జాగ్రత్తలు చెప్పింది. చాలా మంది కామాంధులు ఉన్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.