ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు .
అయితే పక్క ఆధారాలతో గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు తమకు నాలుగు రోజుల పాటు కస్టడీకి కావాలని నాంపల్లిలోని కోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే .అయితే ఈ కేసుకు సంబంధించి తగిన వివరాలను సేకరించడానికి గజల్ ను విచారించాలని పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది .
అయితే ఇప్పటికే బాధితురాలు అన్ని ఆధారాలు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినప్పుడు మరల కస్టడీ ఎందుకు అని కోర్టు ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి .అయితే పక్క ఆధారాలు ,వీడియోలు ,సాక్ష్యాలు ఉన్నప్పుడు గజల్ ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి పోలీసు శాఖకు తెలిపారు ..