తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మలక్ పేట నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన వికలాంగుల జాతీయ పార్క్‌ను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ రూ. 2 కోట్ల నిధులతో కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం దేశంలోనే ప్రథమంగా ఈ పార్క్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించారు. ఈ పార్క్ ఆవరణలో వికలాంగుల కోసం ఫిజియోథెరపీకి సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్క్ ను ప్రారంబించుకోవడం తెలంగాణకే గర్వకారణం అని అన్నారు .రాష్ట్ర జనాభాలో ౩ శాతం ఉన్న వికలాంగుల కోసం ఎంత చేసినా తక్కువే అని పేర్కొన్నారు . త్వరలోనే 6 కార్పొరేషన్ల పరిధిలో ఇలాంటి పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేసారు .హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లలో దివ్యాంగుల కోసం కొన్ని మంజూరు చేస్తామని ఈ సందర్బంగా మంత్రి హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, వికలాంగుల కమిటీ చైర్మెన్ వాసుదేవారెడ్డి , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో పాటు పలువురు పాల్గొన్నారు.
Delighted that India’s 1st park dedicated for the differently abled is being unveiled in Hyderabad today ?
Built by GHMC with a cost of 2Cr at Malakpet. Also includes physiotherapy facilities for differently abled
My compliments to Mayor @bonthurammohan & @CommissionrGHMC pic.twitter.com/JIJpKPlDg2
— KTR (@KTRTRS) January 5, 2018