ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతంది. ఈ పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ తో వారి సమస్యలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం కలికిరి మండలంలోని చెరువుముందరపల్లె వద్ద జగన్ మాట్లడుతూ..వచ్చే ఎన్నికల్లో మీరు వైసీపీ ఓటేసిన మరుసటి రోజే బ్యాంకులకెళ్లి మీ అప్పు ఎంతుందో ఓ చీటీలో రాసుకోండి.. మన ప్రభుత్వం రాగానే నాలుగు దఫాలుగా డబ్బును మీకే నేరుగా ఇస్తా అని వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు కష్టాలు తప్పడం లేదన్నారు. బ్యాంకులో మాఫీ జరగకపోగా కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదని తెలిపారు. ఇంకొందరు వృద్ధులు తమకు పింఛన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత అప్పుంటుందో అంతా బ్యాంకులకు కాదు నేరుగా మీకే చేరేలా చేస్తా. బ్యాంకులకు వడ్డీలు చెల్లించకుండా డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు.
మన ప్రభుత్వం అలా చేయ్యదు….అలా చేస్తే నేను మిమ్మల్ని ఓటు అడగను అని జగన్ అన్నారు. రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో వడ్డీ మాఫీ కాలేదు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపి బాగా చదివించండి. ఇందుకోసం ఏ తల్లీ ఇబ్బంది పడకూడదు. మీ బిడ్డల చదువులకు సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తాం. పింఛను రాలేదని చెబుతున్న అవ్వాతాతలను చూస్తుంటే బాధేస్తుంది. అందుకే మన ప్రభుత్వంలో 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం. ప్రతి అవ్వా నా మనవడు చెప్పాడని.. ప్రతి తల్లి నా కొడుకు చెప్పాడని ఈ విషయాలను అందరికీ చెప్పండి. ఈ రాక్షస పాలన అంతమవ్వాలని జగన్ ప్రజలకు తెలిపారు