Home / ANDHRAPRADESH / ఒక ఎస్‌ఐ జగన్‌తో మాట్లాడడం చూసి..వారికి బీపీ

ఒక ఎస్‌ఐ జగన్‌తో మాట్లాడడం చూసి..వారికి బీపీ

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్‌ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ కలవడంతో టీడీపీకి .. వారి అనూకుల మీడియాలు కస్సుబుస్సుమంటున్నాయి. సామాన్యంగా రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం దూరంగా ఉంటారు… ఫార్మాలిటీగా విష్ చెయ్యటం, లేకపోతే ఏదన్నా విషయం బ్రీఫ్ చెయ్యటం, ఇంత వరుకే ఉంటుంది… ఏమన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, అది బహిరంగంగా బయట చూపించరు.. కాని నిన్న జగన్ పాదయాత్రలో ఒక ఆశక్తికరమైన సంఘటన చోటు చేసుకుని… ఒక పోలీసు అధికారి జగన్ చెయ్యి పట్టుకుని, కొంత దూరం పాదయాత్ర చెయ్యటంతో అక్కడ అందరూ అవాక్కయ్యారు… మరీ ఇంత బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడితో, పోలీసు ఉన్నత స్థాయి అధికారి చేయి చేయి పట్టుకుని ఒక రాజకీయ యాత్రలో నడవటం, అందరినీ ఆశ్చర్య పరించింది… వివరాలు ఇలా ఉన్నాయి.. ఒక ఎస్‌ఐ జగన్‌తో మాట్లాడడం చూసి బీపీ పెరిగిపోయింది. టీడీపీ అనుకూల పత్రికలు రెండు సదరు ఎస్‌ఐపై కస్సుబుస్సుమంటున్నాయి. జగన్‌ ఒక ప్రతిపక్ష నేత, కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనతో మాట్లాడితే తప్పేంటన్నది కూడా పట్టించుకోకుండా కథనాలు రాశాయి.

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల ఎస్‌ఐ నాగార్జున రెడ్డి.. జగన్‌ పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర చేస్తుండగా ఆయన వద్దకు వెళ్లి భద్రత అంశాలపై చర్చించారు. ఆ సమయంలో జగన్‌ నడుస్తూ వెళ్తుండడంతో నాగార్జున రెడ్డి కూడా నడుస్తూ ముందుకు సాగారు. అంతే కొన్ని మీడియా కెమెరాలకు కన్నుకుట్టింది. ఎస్‌ఐ జగన్‌తో కలిసి ఎలా నడుస్తారంటూ ఉదయాన్నే పత్రికల్లో ప్రశ్నించాయి.
జగన్ ఒక ప్రతిపక్ష నేత, కేబినెట్ హోదా ఉన్న వ్యక్తి, పైగా పాదయాత్రలో భద్రత అంశాలపై ఎస్‌ఐ మాట్లాడి ఉండవచ్చు కదా అన్న వాటితో సంబంధం లేకుండా గుండెలు బాదుకున్నాయి రెండు ప్రతికలు. ఆ రెండు పత్రికలకు మరో అంశం కూడా ఇంకా కడుపుమంటను పుట్టించింది. సదరు ఎస్‌ఐ అనంతపురం జిల్లాకు చెందిన వారు. పులివెందులలో వివాహం చేసుకున్నారు. పులివెందుల అల్లుడు అని తెలియడంతో సహజంగానే ఆ రెండు పత్రికల బీపీ నసాళానికి అంటింది. ఎస్‌ఐ ఏదో దేశద్రోహానికి పాల్పడినట్టు కథనాలు అచ్చేశాయి ఆ రెండు పత్రికలు. కాని జగన్ తో ఎస్‌ఐ మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత కాబట్టి…దీని భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్‌ఐ కనుక మాట్లాడినట్లు తెలిసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat