పవర్ స్టార్ పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం అజ్ఞాతవాసి. అయితే, అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కంగారు పడుతున్నారు. ఇంతకీ ఆ వార్త ఏందనేగా మీ డౌట్. అదే కాపీ రైట్స్ వివాదం. అవును ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్ర బృందాన్ని కాపీరైట్స్ వివాదం వెంటాడుతోంది. ఇందుకు సంబంధించి బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ.సిరీస్ నుంచి నోటీసులు కూడా అందాయని, 2008లో విడుదలైన ఫ్రెంచ్ ఫిల్మ్ లార్గోవించ్ హిందీలో రీమేక్ చేసేందుకు టీ సిరీస్ నిర్మాణ సంస్థ ఆ చిత్రం రీమేక్ హక్కులను కొనుగోలు చేసిందట. అయితే, అజ్ఞాతవాసి చిత్రం కూడా లార్గోవించ్ చిత్రానికి రీమేక్ అనే టాక్ బయటకు రావడంతో టీ సిరీస్ నిర్మాణ సంస్థ అలెర్ట్ అయిందట. ఇందుకు సంబంధించి వివరణ కోరుతూ.. అజ్ఞాతవాసి నిర్మాత చిన్నబాబుకు నోటీసులను కూడా పంపింది టీ.సిరీస్. అయితే, ఈ విషయాన్ని చిన్నబాబు అధికారికంగా ధృవీకరించకపోవడం గమనార్హం.
మరో విషయమేమిటంటే.. ఈ రీమేక్ వివాదాన్ని సరిదిద్దేందుకు దగ్గుబాటి రాణా రంగంలోకి దిగారని, అయితే, టీ.సిరీస్ నిర్మాణ సంస్థ యజమాని భూషణ్ దగ్గుబాటి రాణాకు బాగా సన్నిహితుడు వాడు కావడంతో .. రాణాను నిర్మాత చిన్నబాబు రంగంలోకి దింపారని టాలీవుడ్ టాక్. అయితే, అజ్ఞాతవాసి రీలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పవన్ ఫ్యాన్స్‌ను ఈ రీమేక్ వివాదం కంగారుపెడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.