అతి దారుణంగా రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైనా బాధితురాలు.. గాయాలతో చికిత్స పొందుతూ ఇటీవలే మరణించింది. రష్యాకు చెందిన 33 ఏళ్ల బ్రమినా కాస్మోటిక్ రిప్రజెంటేటివ్‌గా పని చేసేది. రెండేళ్ల కిందట గిజార్ జియాంగరీవ్ అనే రేపిస్ట్ ఆమెపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టాడు. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. కత్తితో బెదిరించాడు. తర్వాత చెట్టు కొమ్మను ఆమె మర్మాంగాల్లోకి నెట్టి చిత్రహింసలకు గురి చేశాడు.
2015లో జరిగిన అత్యంత క్రూరమైన ఈ దాడి కారణంగా బ్రమినా తీవ్ర అనారోగ్యానికి లోనైంది. ఒకేసారి అనేక అవయవాలు పని చేయకుండా పోయాయి. అది హార్ట్ ఎటాక్‌కు దారితీసింది. దీంతో ఏడాదిపాటు ఆమె కోమాలో ఉండిపోయింది. తిరిగి కోమా నుంచి బయటకి వచ్చినప్పటికీ.. 30 కిలోల మేర బరువు తగ్గింది. రేప్ ఘటన ఆమెను షాక్‌కి గురి చేయడంతో మాట్లాడలేకపోయింది. గత రెండేళ్లుగా హాస్పిటల్లోనే చికిత్స పొందిన ఆమె తుది శ్వాస విడిచింది.
ఒకే వారంలో బ్రమినాతోపాటు మరో ముగ్గురు మహిళలను రేప్ చేసిన జియాంగరీవ్‌కు న్యాయస్థానం 23 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కానీ ముగ్గురు పిల్లలు, వృద్ధురాలైన తల్లి తనపై ఆధార పడ్డారని.. వారి సంరక్షణ బాధ్యతలు చూడటం కోసం శిక్ష తగ్గించాలని నిందితుడు న్యాయస్థానాన్ని కోరుతున్నాడు. దారుణానికి పాల్పడిందే కాకుండా.. శిక్ష తగ్గించాలని ఎలా కోరుతున్నాడంటూ.. జియాంగరీవ్‌పై బ్రమినా కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు.