తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ యాదాద్రి భువనగి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గ స్థానాలను టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం బీరాలు పలుకుతున్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తిరిగి మరోసారి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటికే జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం వెల్లడించాయని తెలిపారు .
