వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో కాళీ ఏర్పడిన కర్నూల్ స్థానిక సంస్థల స్థానానికి 2018 జనవరి 12 న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకుగానూ దాఖలైన నామినేషన్లలో బీఎస్పీ అభ్యర్ధి దండు శేషుయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో శేషుయాదవ్ పై గూడూరు ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు విచారణ చేయగా వాస్తవమని తేలడంతో దండు శేషు యాదవ్ నామినేషన్ను తిరస్కరించారు. ఇటు అధికార పార్టీ అభ్యర్థి కెఇ ప్రభాకర అభ్యర్థిత్వం సరిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఈ ఎన్నికకు ప్రతిపక్ష వైసీపీ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
.