టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ విజయ్ సాయి ఇటివల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే .అయితే తన మరణానికి భార్య అయిన వనితా రెడ్డి కారణం అని ఏకంగా సెల్ఫి వీడియో తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఈ వీడియోలో విజయ్ సాయి తన భార్యపై పలు ఆరోపణలు కూడా చేశారు .
విజయ్ సాయి మరణం తర్వాత అతని భార్య వనితా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు .తాజాగా ఆమె అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మరణానికి తను కారణం కాదు అని తేల్చేశారు .తను ఎందుకు అజ్ఞాత వాసంలోకి వెళ్ళాల్సి వచ్చింది .తన భర్త వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల గురించి ఆధారాలను పోలీసులకు అప్పజెప్తాను అని ఆమె తెలిపారు .
అంతే కాకుండా ఏకంగా తన భర్త సాయి తల్లిదండ్రుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు .సాక్ష్యాల కోసమే ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాను ..ఇంకా వీటి గురించి పలు ఆధారాలను పోలీసులకు అప్పజేప్తను అని ఆమె తెలిపారు ..