ఏపీలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక ఎమ్మెల్సీని కొనడానికి టిడిపి పార్టీ ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిన వీడియో మన కళ్ళెదురుగానే ఉంది. అదే ఓటుకు నోటుకు కేసు. ఇక ఎపిలో కూడా టిడిపికి పది శాతం బలంలేని చోట కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేస్తూ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ ఆవేధనతోనే వైఎస్ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాడు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నికల్లో అధికార పార్టీ ధన బలం, నీచ రాజకీయాలను గర్హిస్తూ బహిష్కరిస్తున్నామని చెప్పడం ప్రభుత్వానికే అవమానం.
కానీ ఆ విదంగా ఎనాలసిస్ చేయడానికి పచ్చ మీడియాకు అస్సలు మనసొప్పలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీల విలువ ఏంటో ఇదే మీడియా సంస్థలు, చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు ఎన్నో సార్లు చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే అది ప్రజాస్వామ్యం అవదు…… నియంతృత్వం, రాచరికం అవుతుందని వాళ్ళే చెప్పారు. ప్రతిపక్షం బహిష్కరించింది అంటే ప్రభుత్వం అవమానంగా భావించాలి. కానీ పచ్చ బ్యాచ్ మొత్తం కూడా పిచ్చ ఆనందంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని వైకాపా చెప్పగానే పచ్చ మీడియా అంతా కూడా టిడిపి బూస్ట్, టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనందం అంటూ అన్నీ కూడా అలాంటి వార్తలే ప్రచురించారు. ఇక టిడిపి నాయకులు కూడా జగన్ బహిష్కరించడం మహదానందం అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళ మాటలు చూస్తుంటేనే జగన్ పోటీ చేస్తే ఏ స్థాయిలో భయపడేవాళ్ళో తెలుస్తోంది. నిజంగా బలం ఉన్నవాళ్ళయితే జగన్ పోటీ చేస్తే మాత్రం వాళ్ళే గెలుస్తారుగా. అంటే బలం లేదని వాళ్ళకు కూడా తెలుసా? వాళ్ళకే కాదు….. రాజకీయాల గురించి ఓనమాలు తెలిసినవాళ్ళందరికీ కూడా టిడిపికి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదని తెలుసు. కానీ డబ్బు బలంతో గెలవగలదని కూడా తెలుసు. జగన్ ఎన్నికలను బహిష్కరించడానికి కారణం కూడా అదే. బహిష్కరణ నిర్ణయం ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్న విషయం కూడా అదే. డబ్బు, అధికార రాజకీయాలతో వ్యవస్థలు ఎంతగా నాశనం అవుతున్నాయో చెప్పాలన్నదే జగన్ ప్రయత్నం