ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను మీదుగా కొనసాగిన యాత్ర 10 గంలకు గాజులవారిపల్లె చేరుకుంటుంది. అనంతరం చామలగొంది క్రాస్ నుంచి 11 గంటలకు ధనియని చెరువు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఎన్.పి కుంట మండలంలోని ధనియని చెరువులో వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ధనియని చెరువులో మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. డి కొత్తపల్లి, కొట్టాలవారిపేట మీదుగా సాగిన పాదయాత్ర 5 గంటలకు బండారుచెట్లుపల్లికి చేరుకుంటుంది. వెంకమద్ది క్రాస్ లో 44వ రోజు పాదయాత్ర ముగుస్తుంది. జననేత వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు.
