తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 258 బూత్‌లలో లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపును పూర్తి చేస్తారు. 18 రౌండ్లలో 252 బూత్‌లలో ఓట్లను లెక్కింపు జరగగా.. ఆఖరి రౌండ్‌లో ఆరు బూత్‌లలో లెక్కింపు జరుగుతుంది. మొత్తం 100 మంది అధికారుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.తొలిరౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీటీవీ దినకరన్ ఆధిక్యంలో ఉన్నారు. దినకరన్ 2,576 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి టేబుల్ నంబర్ 9 మినహా మిగిలిన అన్ని టేబుళ్లలో దినకరన్‌దే ఆధిక్యం.