తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ ఇద్దరు మంత్రులు సరదాగా ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు పలువురు షేర్ చేస్తూన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినేష్ డీటీపీ (దినేష్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్) పేరుతో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ సెంటర్లో కాసేపు వ్యాయామం చేసిన మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిట్నెస్ కోసం రోజుకు కొంతసేపు సమయం కేటాయించలేకపోతున్నామంటూ చాలా మంది అంటుంటారని, అది శుద్ధ అబద్దం అన్నారు. మనకోసం మనం కాస్త సమయం కేటాయించుకోకపోవడం సరికాదని,తన మటుకు తాను బద్దకం వల్లనే వర్కవుట్స్ చేయడం లేదన్నారు. గతంలో తాను రెగ్యులర్‌గా ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకునే వాడినని ఇప్పుడు చేయడం లేదన్నారు. కొత్త సంవత్సరంనుంచి ఖచ్చితంగా రోజుకు కొంతసేపు వ్యాయామానికి కేటాయించాలని గట్టిగా నిర్ణయించుకుంటున్నానని, తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు.
కాగా, నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో వస్త్రాలు…హస్తకళలు ఏర్పాటు చేసిన ‘పక్కా హైదరాబాద్’ ఫ్యామిలీ ఫెస్ట్‌ను రాష్ట్ర భారీ పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ మంత్రి వినోద్‌తో కలిసి ప్రారంభించారు. క్రిస్మస్ సెలవుల్లో చిన్నారులకు ఆడవిపుడుగా, పెద్దలకు ఉత్సాహాన్ని అందించేందు ఈ ఫెస్ట్ ఏర్పాటు చేశా. అక్కడ వింటేజ్ స్కూటర్ ఎక్కి మంత్రి అందరిని ఉత్సాహపరిచారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పక్కా హైదరాబాద్ పేరుతో 21 రోజుల పాటు నిర్వహించే ఈ మెగాకార్నివాల్ క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవుల్లో జంట నగరాల్లోని పిల్లలకు ఆనందాన్ని పంచుతుందన్నారు.