ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి గురించి ఆయన మిత్రుడు సహాయం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్ గంట వ్యవధిలో స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు సహాయం అందించి ఆయన ప్రాణాలు నిలిపేలా చేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన బల్వీందర్ సింగ్ ఐదు రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆయన్ను ఎల్‌బీ నగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా… మెదడులో రక్తం గడ్డం కట్టడం, ఊపిరితిత్తుల్లో రక్తసరఫరా నిలిచిపోవడంతో ప్రాణాపాయ స్థితి తలెత్తింది. వెంటలీటర్‌పై ఉన్న ఆయనకు ఐదు రోజుల వ్యవధిలో రూ.8లక్షల బిల్లు కట్టాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యం కోరింది. ఈ నేపథ్యంలో తన ఆప్తమిత్రుడి అపస్మారక స్థితిని తెలియజేస్తూ పెద్ద మనసుతో ఎవరైనా సహాయం చేయాలని రోహిత్ మహంకాళి తనే వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే తన కార్యాలయ సిబ్బందిని తగు సహాయం అందించాలని కోరారు. దాదాపు 2గంటల వ్యవధిలోనే రూ.2 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధికి అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సమస్యను ప్రస్తావించి రోహిత్‌కు తెలియజేయగా….‘చాలా గొప్ప మనసు మీది. ధన్యవాదాలు’ అని మంత్రి కేటీఆర్ పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు.
Money sanctioned for treatment pic.twitter.com/CrBTLSzBK3
— KTR (@KTRTRS) December 23, 2017
1/2 Sr @KTRTRS @KTRoffice a close friend Balvinder met with an accident on 5dec near Outer Ring Road, in which he was severely injured.He is currently hospitalised in Global Hospital, LB Nagar.He has been identified with Blood clots in the brain, blood blockage in the lungs and pic.twitter.com/gjHiPu8tmg
— RohitMahankali? (@rohit_mrfw) December 13, 2017
2/2 He is on ventilator Till date the bill has amounted to Rs. 8 lakhs He needs financial help from the kind hearted.
your contribute would be of great help right now.
You can contact his own brother, Maninder Singh : +918686600737— RohitMahankali? (@rohit_mrfw) December 13, 2017