ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. 42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. యాకాల చెరువు కొత్తపల్లి, కొండమనాయుని పల్లి, వరిగిరెడ్డిపల్లి, గట్లు క్రాస్ రోడ్డు, పార్థసారధి కాలనీ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వీవర్స్ కాలనీ నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగుతుంది. కోనేరు సర్కిల్, క్లాక్ టవర్ సర్కిల్ మీదుగా ఇందిరా సర్కిల్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు.