ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 88 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. శ్రీలంకకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 261 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక 17.2 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), జయదేవ్(1) వికెట్లతో శ్రీలంక నడ్డి విడిచారు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (118) రికార్డు సెంచరీ చేసిన విషయం తెలిసిందే.