తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో సీఎం క్రిస్మస్ కేకును కట్ చేయించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… క్రైస్తవ బంధువులందరికీ వందనాలు. పరాధీన స్థితిలో ఉన్న తెలంగాణ స్వాధీన స్థితిలోకి వచ్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. గత పాలకుల హయాంలో ఇలాంటి క్రిస్మస్ వేడుకలు ఎప్పుడూ జరగలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాత చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఇందుకు కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు.