తెలంగాణ రాష్టం లోని కార్మిక శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 248 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 172 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, 45 టెక్నికల్ అసిస్టెంట్, 18 డ్రెస్సర్, 10 ఫార్మాసిస్ట్ ఖాళీలు, రెండు లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ బాయిలర్స్ ఒక పోస్టు భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.
