Home / SLIDER / ప్రింటింగ్ ప్రెస్ కూలోడివి…ఇన్నికోట్లెక్క‌డివి రేవంత్‌..?

ప్రింటింగ్ ప్రెస్ కూలోడివి…ఇన్నికోట్లెక్క‌డివి రేవంత్‌..?

కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం చిత్రంగా ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆరెస్ ఎల్పీ లో విలేకరులతో మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిప‌డ్డారు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు జడ్చర్ల కాంగ్రెస్ సభ జరిగిందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 30 వేలమందిపై గురిపెట్టి 3 వేల మంది కూడా హాజరు కాకుండా స‌భ ముగిసిపోయింద‌ని ఎద్దేవా చేశారు.

3 వేల మందితో అగ్ర నేతలంతా సభ చేసి జబ్బలు చరుచుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. సిగ్గు లేకుండా తెలంగాణ గురించి మాట్లాడారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్ శని ని వదలించుకోవాలని చూస్తున్నార..ఆ దరిద్రాన్ని దరిదాపుల కనిపించకుండా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి కూడా ఏమీ కాలేదని మాట్లాడటం దురదృష్టకరమ‌ని అన్నారు. కళ్లుండి చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ మారిందని అన్నారు. `కాంగ్రెస్  వాళ్ళు అవినీతి గురించి మాట్లాడటం ఆశ్చర్యం. వాళ్ళ పాప పంకిలాన్ని కడగలేక పోతున్నాం. ప్రాజెక్టుల మీద పనికిమాలిన దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు దోచిన ప్రాజెక్టుల ను నానా తంటాలు పడి తిరిగి ప్రారంభించాం

ఇంతగా అబద్ధాలు చెబితే వాళ్ళను ఏమనాలి వెధవలు అనాలా? వద్దా? ఇంతకాలం ప్రాజెక్టులను ఎందుకు కట్టలేదు? కరెంటును రోజుకు ఐదారు గంటలు కూడా ఇవ్వలేని దద్దమ్మలు` అని మండిప‌డ్డారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం చేసిందని మంత్రి ల‌క్ష్మారెడ్డి అన్నారు. `ఉమ్మడి రాష్ట్రంలో నిధులు కొల్లగొడుతుంటే దద్దమ్మల్లా ఎందుకున్నారు? ఇక వీళ్లకు తోడుగా ఒక జోకర్ తయారు అయ్యాడు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు దిగొద్దు. లత్కోరు రాజకీయాలు చేయొద్దు. చార్లెస్ శోభారాజ్ కంటే ఘనుడవు నీవు. నీలా బ్లాక్ మెయిల్ చేయను, ద్రోహిని కాదు. అవును నేను రియల్ వ్యాపారం చేస్తున్నాను. కష్టపడి సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నా. ప్రింటింగ్ ప్రెస్ లో కూలీ గాడివి ఇప్పుడు  వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించావు? అట్టర్ ఫ్లాప్ సభలు పెట్టి అనవసర ప్రేలాపణలు వద్దు. మీలా పత్తాలు ఆడే బాపతు మంత్రులం కాదు మేం.బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు పాటు పడుతున్నాంమా సీఎం గురించి, మా మంత్రుల గురించి మాట్లాడితే ఖబడ్దార్‌.“ అని హెచ్చ‌రించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat