Home / NATIONAL / సీఎం కుర్చీపై బెట్టింగ్ జోరు

సీఎం కుర్చీపై బెట్టింగ్ జోరు

దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను సృష్టించిన గుజ‌రాత్ ఎన్నికలు ఫలితం త‌ర్వాత కూడా అదే ట్విస్ట్‌ను కొన‌సాగిస్తోంది. గ‌ట్టిపోటీ మ‌ధ్య గెలుపు సాధించిన రాష్ట్రంలో సీఎం కుర్చీపై ఎవ‌రిని కూర్చోబెట్టాల‌నే అంశంపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గుజరాత్‌ సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మ‌రోవైపు ముఖ్యమంత్రి రేసులో రోజుకోపేరు తెరపైకి వస్తోంది. బీజేపీ హై కమాండ్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాలాగ పందెం రాయుళ్లు మాత్రం సీఎం అభ్యర్ధిపై జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు.

ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ల నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికలను మోడీ సారథ్యంలోనే ఎదుర్కొన్నారు. ‘ఈసారి తక్కువ మెజార్టీతో గెలిచినందున, ముఖ్యమంత్రిని మార్చాలని పార్టీ యోచిస్తోంది’ అని పార్టీ వర్గాలు ప్ర‌చారంలో పెట్టాయి. అయిన‌ప్ప‌టికీ…గుజరాత్ సీఎం అభ్యర్ధి రేసులో ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, నితిన్ పటేల్ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. అమిత్‌షా కూడా సీఎం అవుతాడంటూ జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కౌంటింగ్‌కు ముందు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారంటూ బెట్టింగ్ కట్టిన బుకీలు తాజాగా సీఎం కుర్చీపై ఎవ‌రు కూర్చుంటార‌నే దానిపై భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరానికి చేర్చిన విజయ్‌ రూపానీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. మ‌రోవైపు అమిత్ షా పేరు అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆనందిబెన్ పటేల్ తర్వాత అందరూ నితిన్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారంటే ఎవరూ ఊహించని విధంగా విజయ్ రూపానీ సీఎం అవ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ…అలాగే యూపీలో కూడా ఎవరి అంచనాలకు అందకుండా యోగి ఆదిత్యనాథ్ సిఎం పీఠం ఎక్కారు.ఈ నేపథ్యంలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో అమిత్‌షా మీద కూడా పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. స్థూలంగా సీఎం సీటుపై బెట్టింగ్ కాయ‌డం అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

కాగా,  182 స్థానాలు కలిగిన అసెంబ్లీలో బిజెపి 99 మంది అభ్యర్థులను గెల్చుకుంది. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కనీసం 92 సీట్లు అవసరం కాగా, అదనంగా కేవలం ఏడు సీట్లను మాత్రమే సాధించింది. ఇదే సమయంలో కాంగ్రెస్, తన భాగస్వామ్య పక్షాలతో కలిసి 80 స్థానాలను గెల్చుకుంది. డిసెంబరు 25న  వాజపేయి జన్మదినం కావడంతో అదే రోజు నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat